పాపన్నపేట, జనవరి 1: ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. 2023 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2024లోకి అడుగిడిన సందర్భంగా జిల్లాతో పాటు పొరుగు జిల్లాలు, రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకుని అమ్మవారికి మొకులు చెల్లించుకున్నారు.
కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే కలగాలని అమ్మవారిని మొకుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్‌రెడ్డితో పాటు పాలకమండలి సభ్యులు ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై మహిపాల్ రెడ్డి తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.