మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 16: యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు మెదక్ సీఎస్ఐ చర్చి ఆవరణలో కేధడ్రల్ పాస్టరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏసుక్రీస్తు జన్మదినానికి సూచికగా బిషప్ రెవరెండ్ సాలోమాన్‌రాజ్, బిషపమ్మ వజ్ర సంతోషిణి, చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి జార్జి ఎభినేజర్రాజు కలిసి కేక్‌కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సండే స్కూల్‌కు చెందిన చిన్నారులు వివిధ వేషాధారణతో ప్రదర్శనలు, నృత్యాలు చేసి అందరినీ అలరింపజేశారు. అనంతరం ఏసయ్య భక్తిగీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ ఏసు చూపిన మార్గంలోనే అందరూ నడుచుకోవాలన్నారు. ఈ వేడుకల్లో పాస్టర్లు జైపాల్, డేవిడ్, శ్రీనివాస్, సువర్ణ, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు పాలిన్ రత్నకిరణ్ సందీప్, చర్చి కమిటీ సభ్యులు రోలండ్పాల్, వికాస్, సంశాన్ సందీప్, సువన్డగ్లస్, జాయ్‌ముర్రే, సునీల్, అనూఫ్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.