నంగునూరు, ఫిబ్రవరి 10: సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం రాజగోపాల్‌పేట వద్ద సెంట్రల్ లైటింగ్, ఫుట్‌పాత్‌తో కూడిన డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని ఇటీవల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు.
ఈ మేరకు గడ్కరీ సానుకూలంగా స్పందించి హరీశ్‌రావుకు తిరిగి లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రాజ్గోపాల్పేటలో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజ్ సిస్టమ్‌తో ఫుట్‌పాత్ నిర్మాణం చేపట్టాలని కోరారని, వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తన లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీకి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.