కొండపాక(కుకునూరుపల్లి), ఫిబ్రవరి 23 : అనుమానాస్పద స్థితిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాత్రి సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది. కుకనూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకా రం.. సిద్దిపేట పట్టణంలోని సాయి విద్యానగర్‌కు చెందిన శిరోద్కర్ లక్ష్మి(55), రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్కు చెందిన టింగ్లేకర్ శ్రీధర్(45) తిమ్మారెడ్డిపల్లి శివారులోని రాజీవ్ రహదారి పక్కన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పుంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు మం టలు ఆర్పి వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
కానీ, సంఘటనా స్థలంలోనే లక్ష్మి మృతిచెందగా, 80 శాతం కాలిన గాయాలతో ఉన్న శ్రీధర్‌ను టోల్గేట్ అంబులెన్స్ ద్వారా సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతురాలి లక్ష్మి భర్త గతంలో మృతిచెందగా శ్రీధర్‌తో పాటు సిద్దిపేటలో కొంతకాలం కిరాయికి ఉండి అక్కడి నుంచి చేర్యాలకు వెళ్లారు. సంఘటనా స్థలంలో మెడికల్ రిపోర్టులు లభ్యం కావడంతో అనారోగ్య కారణాలతోనే శ్రీధర్, లక్ష్మి ఆత్మహత్యకు పా ల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపాడు.