సిద్దిపేట, ఫిబ్రవరి: భద్రాద్రి కొత్తగూడెంలో జరుగుతున్న 9వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో భాగంగా స్టాండింగ్ బ్రాడ్జంప్లో సిద్దిపేటకు చెం దిన గాడిచర్ల జితేశ్ 1.94 మీ టర్ల విభాగం, 300 మీటర్ల ప రుగుపందెం పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి రెండు గోల్డ్‌మెడల్స్ సాధించాడు. తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ సెక్రెటరీ సారంగపాణి గోల్డ్ మెడల్, మెరిట్ సర్టిఫికెట్ జితేష్‌కు అందజేశారు. గోల్డ్‌మెడల్ సాధించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గ్యా దరి పరమేశ్వర్ సెక్రెటరీ వెంకటస్వామి, కోచ్ కల్లపల్లి కృష్ణలు జితేష్‌ను అభినందించారు.