కొల్చారం, డిసెంబర్ 6: మెదక్ జిల్లా కొల్చారం మండలంలో రెండు గ్రామాల్లో బీఆర్ఎస్ (BRS) సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏటిగడ్డ మాందాపూర్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన దారు పేరోళ్ల కమలమ్మ(Daru Perolla Kamalamma), వసురం తండాలో దారు వినోద్ నాయక్ (Daru Vinod Naik)లు ఏకగ్రీవంగా సర్పంచ్ పదవికి ఎంపికయ్యారు. పోతిరెడ్డిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి శేఖర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు.
కొల్చారం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ నామినేషన్ లెక్క తేలింది. మూడో దశ నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో.. శనివారం దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అధికారులు సర్పంచ్ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేశారు. మండలంలో 21 గ్రామపంచాయతీలకు 87 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. చివరకు బీఆర్ఎస్ అభ్యర్థులు రెండు చోట్లా, కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
