రాయపోల్, మే 11: సిద్దిపేట జిల్లా రాయపోల్ మం డలంలోని మంతూర్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు సైన్యంలో విధులు నిర్వహిస్తూ దేశసేవ చేస్తున్నారు. అనాజీపూర్కు చెందిన రిటైర్ట్ ఆర్మీ సైనికుడు నీల చంద్రం సోదరి ఇద్దరు కుమారులు నందీశ్వర్, ఆంజనేయులు మేనమామ బాటలోనే ఆర్మీలో చేరారు. మేనమామ ప్రోత్సాహంతో వీరిద్దరూ 2018లో ఆర్మీకి ఎంపికయ్యారు.
ఆంజనేయులు ప్రస్తుతం జమ్ముకశ్మీర్ సెక్టార్లోని బారాముల్లా వద్ద, నందీశ్వర్ రాజస్థాన్లోని జైసల్మేర్ సెక్ట్టార్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని రాయపోల్ మండలంలోని వీరారెడ్డిపల్లి, తిమ్మక్కపల్లి, మంతూర్ తదితర గ్రామాల నుంచి ఒక్కొక్కరు ఆర్మీలో చేరారు.