చరిత్ర సృష్టించిన ఆర్టీసీ
ప్రజారవాణా సంస్థ ఆర్టీసీ నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ అందరి మన్నలు అందుకుంటూ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నది. అందుకు సిద్దిపేట ఆర్టీసీ ఒక్కరోజు ఆదాయం తర్కానంగా నిలుస్తున్నది
- ఒక్కరోజు ఆదాయం 26.36 లక్షలు
- సిద్దిపేట డిపోలో సంబురాలు
సిద్దిపేట టౌన్, జనవరి 19 : ప్రజారవాణా సంస్థ ఆర్టీసీ నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ అందరి మన్నలు అందుకుంటూ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నది. అందుకు సిద్దిపేట ఆర్టీసీ ఒక్కరోజు ఆదాయం తర్కానంగా నిలుస్తున్నది. సంక్రాంతి సెలవుల్లో భాగంగా ప్రజారవాణా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. బుధవారం సిద్దిపేట ఆర్టీసీ డిపో 26 లక్షల 36 వేల 522 రూపాయల ఆదాయాన్ని గడించి చరిత్ర సృష్టించింది.
ఈ సందర్భంగా డిపో మేనేజర్ సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ సమష్టి కృషితో ఉద్యోగులు, కార్మికులు పనిచేసి ఆదాయం రావడానికి ప్రయత్నించిన అందరినీ అభినందించారు. ఇదే స్ఫూర్తిని కనబరిచి ఆర్టీసీని లాభాల బాటలో పయనింపజేయాలని పిలుపునిచ్చా రు. ప్రయాణికులకు ప్రత్యేకం గా కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ స్వీట్లు పంపిణీ చేసి సంబురాల్లో పాల్గొన్నారు. అసిస్టెంట్ డిపో మేనేజర్ అంజమ్మ, సూపర్వైజర్లు, ఉద్యోగులు, కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- Record Revenue
- Siddipet
- TSRTC
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

