గజ్వేల్, అక్టోబర్ 24: ప్రజలకు ఆహ్లాదం పం చేందుకు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ శివారులో బీఆర్ఎస్ హయాం లో నిర్మించిన అర్బన్ పార్కు త్వరలో అందాలను కోల్పోనున్నది. కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కు మీదుగా ట్రిపుల్ఆర్ రోడ్డు నిర్మించనన్నారు. దీనికి సంబంధించి అలైన్మెంట్ ఖరారైనట్లు తెలిసింది. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగంలో ఉమ్మడి నల్లగొం డ, ఉమ్మడి మెదక్ జిల్లాల పరిధిలోని 180ఎకరాల అటవీ భూముల మీదుగా రోడ్డు నిర్మా ణం చేపట్టనున్నారు. ట్రిపుల్ఆర్ కోసం మొత్తంగా 4750 ఎకరాల భూమిని సేకరించనున్నారు.
ఇందులో 180 ఎకరాలు అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయి. గజ్వేల్ ప్రాంతంలో 70 ఎకరాల అటవీ విస్తీర్ణంలో నుంచి ట్రిపుల్ఆర్ నిర్మాణం కోసం అధికారులు భూసేకరణ చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సం గాపూర్ వద్ద రూ.10కోట్లతో అద్భుతంగా నిర్మించిన అర్బన్పార్కు మీదుగా రోడ్డు వెళ్లనుండడంతో పార్కు తన అందాలను కోల్పోనున్నది. ఈ నిర్ణయంపై ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. ఇది పర్యాటకాభివృద్ధికి విఘాతం కల్గిస్తుందని పేర్కొంటున్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సంగాపూర్ సమీపంలో రూ.10కోట్లకు పైగా వ్యయంతో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న తరహాలో అర్బన్ పార్కును బీఆర్ఎస్ సర్కారు నిర్మించింది. ఈ పార్కులో రాశివనం, నక్షత్ర, స్మృతివనాలు, యోగ, ధ్యాన మందిరాలు, ఆట స్థలాలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులు, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ట్రాక్, కాటేజీలు, గజబోలు, వాచ్టవర్లు ఏర్పాటు చేసి కొత్త హంగులతో తీర్చిదిద్దారు.
ఇదే అటవీ ప్రాంతంలోని మల్కబావిని సైతం కొత్తందాలతో తీర్చిదిద్దారు. సెల వు రోజుల్లో చాలామంది చిన్నారులతో కలసి అర్బన్ పార్కుకు వచ్చి వచ్చి సేదతీరుతున్నారు. ఇప్పుడిప్పుడే పార్కుకు ఆదరణ పెరుగుతుండగా ట్రిపుల్ఆర్ నిర్మాణంతో అర్బన్ పార్కు అందాలను కోల్పోనున్నది. 100మీటర్ల వెడల్పుతో ఆర్ఆర్ఆర్ నిర్మాణం చేపడుతుండగా, అర్బన్ పార్కు మధ్యలో నుంచే రోడ్డు అలైన్మెంట్ ఖరారు చేయడంతో సు మారుగా 30ఎకరాల వరకు పార్కులో భూసేకరణ చేపట్టనున్నారు.
మరో 40ఎకరాల అట వీ భూమిని సంగాపూర్, వర్గల్ మండలం మైలారం పరిధిలోని సేకరించనున్నారు. అర్బన్ పార్కు ప్రాంతంలో ట్రిపుల్ఆర్ నిర్మా ణం జరగనుండడంతో ప్రత్యామ్నాయంగా పార్కుకు వచ్చే సందర్శకులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయనున్నట్లు సమాచా రం. ఉత్తరభాగంలోని 180 ఎకరాల అటవీ భూముల్లో నుంచి ట్రిపుల్ఆర్ వెళ్తనుండడం తో ఇక్కడి భూమికి బదులుగా మహబూబాబాద్ జిల్లాలో మరో భూమిని అటవీ శాఖకు కేటాయించడానికి సిద్ధమైనట్లు తెలిసింది.
సంగాపూర్ శివారులోని అర్బన్ పార్కు మీ దుగా ట్రిపుల్ఆర్ నిర్మాణం చేపట్టడం వాస్తవమే. ట్రిపుల్ఆర్ నిర్మాణం కోసం ప్రాతిపాదనలు జరుగుతున్నాయి. అందుకు తగిన విధంగా కార్యాచరణ చేపడుతున్నాం. గజ్వే ల్ పరిధిలోని అటవీ భూముల్లోంచి కూడా కొంత మేర చేపట్టనున్నారు.
-వినాయక్, ఎఫ్ఆర్వో, గజ్వేల్