చౌటకూర్, మార్చి 8: సంగారెడ్డి-నాందే డ్, అకోలా 161వ జాతీయ రహదారి రక్తసిక్తమయింది. చౌటకూర్ మండలం శివంపేట శివారులోని చార్మినార్ బీరు పరిశ్రమ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు గిరిజన కూలీలు మృతి చెందారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి. అల్లాదుర్గం మండలం ముప్పారం గిరిజన తండాకు చెందిన నేనావత్ అశోక్ (30), టేక్మాల్ మండలం మల్కాపూర్ (అంతాయపల్లి) గిరిజన తండాకు చెందిన లకావత్ శ్రీను (35) సంగారెడ్డి పట్టణంలోని అడ్డాపై కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నా రు. ఇద్దరూ గడిపెద్దాపూర్ చౌర స్తా నుంచి బైక్పై సంగారెడ్డికి బయలుదేరారు.
శివంపేట బీరు పరిశ్రమ వద్దకు రాగానే వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. హెల్మెట్ ధరించి బైక్ నడుపుతున్న అశోక్, వెనుకాల కూర్చున శ్రీను తలపై నుంచి వాహ నం వెళ్లడంతో తల ఛిద్రమై, ఘటనా స్థలమంతా రక్తసిక్తమయింది. ప్రమాదం జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేయడంతో ఇరు కుటుంబాల సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పుల్కల్ ఎస్ఐ శ్రీకాం త్ మృతదేహలకు సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలాన్ని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జైపాల్నాయక్ సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చా రు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద బాధి త గిరిజన కుటుంబాలను ప్రభు త్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.