Tranformer | మెదక్ రూరల్, జూన్ 19 : అది ప్రధాన రహదారి.. నిత్యం వాహనాలు, ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ఆ రహదారి పక్కనే ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకర పరిస్థితిలో ఉంది.
మెదక్ మండలంలోని మంభోజిపల్లి నుంచి నర్సాపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉన్నది. రోడ్డుకు ఆనుకొని ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో రాత్రివేళ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులకు ప్రమాదం పొంచి ఉన్నది.
విద్యుత్ స్తంభానికి బిగించిన ట్రాన్స్ఫార్మర్ భూమి నుంచి తక్కువ ఎత్తులో ఉండడంతో జనావాసులకు, పశువులకు సైతం ప్రమాదం పొంచి ఉన్నదని మంభోజిపల్లి గ్రామస్తులు, ప్రయాణికులు పేర్కొన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడినుంచి తొలగించి మరో చోటికి మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్