భారీగా అక్రమ నిర్మాణాలు
నిబంధనలకు విరుద్ధ్దంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. భారీగా నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
- పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు
- చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
- కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో వందలాదిగా అక్రమ నిర్మాణాలు
- అధికారుల తీరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి
అమీన్పూర్, జూన్ 7 : నిబంధనలకు విరుద్ధ్దంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. భారీగా నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అమీన్పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ గ్రామాల్లోని పలు కాలనీల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా యి. అనుమతులకు మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు.
సెల్లార్‌కు అనుమతులు లేకున్నా నిర్మిస్తున్నారు. తాజాగా పలు కాలనీల్లో జీ ప్లస్ టూ అనుమతులను మించి అదనపు అంతస్తులు, పెంట్‌హౌస్‌లు కడుతున్నా రు. కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ గ్రామాల పరిధిలో సుమారు వందకు పైగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ విషయం టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసినా ఇటువైపు కన్నె త్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏడాదిగా భారీ భవన నిర్మాణాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులకు మించి అదనపు అంతస్తులు నిర్మించేందుకు అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి పడుతుం ది.
జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నామని చెబుతున్నా, నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందుతుండడంతో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను నివారించాల్సిన అధికారులు యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాలు ఒక్కరోజులో ఏర్పడినవు కావు. అధికారుల పర్యవేక్షణా లోపం, నిర్లక్ష్యంతో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్, జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

