సంగారెడ్డి, ఏప్రిల్26: టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సుశీల్‌బాబు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సుశీల్‌బాబు మంగళవారం మధ్యాహ్నం కార్యాలయం నుంచి ఇంటికి వచ్చి భోజనం చేశారు. అనంతరం సోఫాపై వాలిపోయి మృతి చెందారు. ఈ మరణ వార్తను తెలుసుకున్న మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన సుశీల్‌బాబు మృతి తీరని లోటని పేర్కొన్నారు. సుశీల్‌బాబు అంత్యక్రియలు బుధవారం సంగారెడ్డిలో జరిపేందుకు నిర్ణయించారు. అలాగే సుశీల్‌బాబు అకాల మరణ వార్తను తెలుసుకు రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ సంతాపం ప్రకటించారు. టీఎన్జీవో కేంద్ర కమిటీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ సుశీల్‌బాబు మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సుశీల్‌బాబు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని
వేడుకున్నారు.