హుస్నాబాద్‌టౌన్, జూన్ 27: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషిచేస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని నూతనంగా నిర్మించే 150 పడకల దవాఖాన, హుస్నాబాద్ నుంచి చిగురుమామిడి వరకు చేపట్టే నాలుగు వరుసల రహదారి పనులకు శంకుస్థాపన, మాతాశిశు ఆరోగ్య కేంద్ర భవనానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో మంత్రులు దామెదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌గౌడ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుభరోసాకింద రూ.40వేల కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
వ్యవసాయ రంగానికి రూ.లక్షకోట్లు ఖర్చు చేశామన్నారు. త్వరలోనే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. సమాజంలో మార్పు వచ్చేందుకు విద్యా, వైద్యం, నైపుణ్యం ఉండాలని వైద్య,ఆర్యోశాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ అన్నారు. హుస్నాబాద్‌లోని 250 పడకల దవాఖానకు 50 సీట్లతో కూడిన పీజీమెడికల్కళాశాలను మంజూరు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కళాశాల ఉండాలన్నారు.
ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టును పూర్తిచేసే విషయంపై సీఎం రేవంతరెడ్డితో మాట్లాడుతామని, త్వరలోనే సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు నాలుగులైన్ల రహదారి పనులకు రూ.80కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రుల ఆశీస్సులు తనపై, నియోజకవర్గంపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
హుస్నాబాద్ ప్రాంత గౌరవాన్ని పెంచేందుకు నిరంతరం కృషిచేస్తున్నానని మంత్రి పొన్నం చెప్పారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, జిల్లాగ్రంథాలయ సంస్థచైర్మన్ కేడం లింగమూర్తి, డీసీహెచ్ఎస్ అన్నపూర్ణ, జిలా ్లవైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఫల్వన్కుమార్, ఆర్డీవో రామమూర్తి, హుస్నాబాద్ దవాఖాన సూపరింటెండెంట్ రమేశ్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్‌విండోచైర్మన్ బొలిశెట్టి శివయ్య పాల్గొన్నారు.