కల్హేర్, జూలై 21: కారు బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి సర్కిల్ సీఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూరుకు చెందిన తొమ్మిది మంది మంగళవారం తెల్లవారుజామున ఎంహెచ్ 06 ఏఎన్ 7306 కారులో హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి బయలుదేరారు.
ఈ క్రమంలో నిజాంపేట్ మండలం బాచేపల్లి గ్రామ శివారులోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో 161 నంబర్ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని సర్వీస్‌రోడ్డు అవతలి వైపునకు వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహమ్మద్ షామీన్ బేగం (50), మహమ్మద్ అనాబీయా తస్కీం (4) అక్కడికక్కడే మృతి చెందారు. మహమ్మద్ నదీమ్ (32)కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెం దాడు. మహమ్మద్ నవీద్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమి త్తం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించినట్లు తెలిపారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో ఘటనా స్థలాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు.. మృతులు ఎక్కడి ప్రాంతానికి చెందిన వారు, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నారనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎస్పీ వెంట నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.