పటాన్చెరు, ఆగస్టు 12 : హైదరాబాద్‌లో ని చందానగర్ ఖజానా జ్యువెలరీలో దుండగులు తుపాకులతో వచ్చి సిబ్బందిపై కా ల్పులు జరిపి బంగారం, వెండి ఆభరణ లు చోరీచేసి పాపోయారు. మంగళవా రం పటాన్చెరు పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. పటాన్చెరు ఎస్‌హెచ్‌వో వినాయకరెడ్డి, ఎస్సై సుభాశ్ ఆధ్వర్యంలో 65వ జాతీయ రహదారిపై తనిఖీలు చేశారు.
చందానగర్ ఖజానా జ్యువెలరీ షాపులోకి ఆరుగురు దుండగులు తుపాకులతో లోపలికి వెళ్లగా, ఒకరు బయట ఉన్నట్లు సీసీ కెమెరా పుటేజీలో నమోదైందని పోలీసులు తెలిపారు. బంగారం షాపులో దొంగతనం చేసిన వారు పటాన్చెరు వైపు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో పటాన్చెరు పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. దుండగుల వద్ద తుపాకులు ఉన్నట్లు చందానగర్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో పటాన్చెరు పోలీసులు తుపాకులు పట్టుకుని వాహనాలు తనిఖీలు చేశారు. పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్‌పుర్,పటాన్చెరు పీఎస్‌ల పరిధిలో పోలీసు లు వాహనాలను తనిఖీ చేశారు. రామచందపురం, పటాన్చెరు, అమీన్‌పుర్,పటాన్చెరు పోలీసులు రాత్రి పెట్రోలింగ్ ముమ్మరం చేశారు.