గుమ్మడిదల, మే 25: పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి, ప్రజలకు ఆహ్లాదం కల్పించడానికి రాష్ట్రంలో అర్బన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావ రణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొం తపల్లి వీరభద్రస్వామి ఆలయానికి సమీపం లో ఏర్పాటు చేసిన అమృతవనం ఎకో అర్బన్‌పార్కును, మండలంలోని మంభా పూర్ అటవీప్రాంతంలో జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేసిన హరితవనం ఎకో అర్బన్ పార్కును సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు పచ్చని వాతా వరణాన్ని అందించడానికి అర్బన్ పార్కులు ఎంతగానో దోహద పడతాయని తెలిపారు.
అర్బన్ పార్కుల్లో ధాన్య మండ పాలు, చిన్నారులకు ఆటస్థలాలు, వాకింగ్ ట్రాక్‌లు వంటి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. అర్బన్ పార్కుల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళలో వాకింగ్, ధ్యానం చేస్తే మంచి ఆరోగ్యవంతులు అవు తారన్నారని తెలిపారు. అనంతరం వీరభద్ర స్వామిని మంత్రి దర్శించుకుని పూజలు చేశారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, చీఫ్ కన్వర్వేటర్ ఫారెస్ట్, చార్మినార్ సర్కిల్ హైదరాబాద్ డాక్టర్ ప్రియాంకవర్గీస్, జిల్లా అటవీశాఖ అధికారి కేఏవీఎస్ ప్రసాద్‌రెడ్డి, పారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె.దేవిలాల్, మున్సిపల్ చైర్మన్ సీహెచ్. కుమార్‌గౌడ్, వైస్ చైర్పర్సన్ సంధ్యారెడ్డి, కమిషనర్ దశ రథ్, తహసీల్దార్ పరమేశం,కౌన్సిలర్లు పాల్గొన్నారు.