సర్పంచ్ల సేవలు మరువలేనివి
గ్రామాల అభివృద్ధి లో సర్పంచ్ల పాత్ర మరువలేనిదని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. గురువారం చేర్యాలలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
- జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ
- సర్పంచ్‌లకు సన్మానం
చేర్యాల, ఫిబ్రవరి 1: గ్రామాల అభివృద్ధి లో సర్పంచ్ల పాత్ర మరువలేనిదని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. గురువారం చేర్యాలలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్పర్సన్ హాజ రై మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ హయాం లోనే సర్పంచ్‌లు అనేక పథకాలను ప్రజలకు చేరవేసి మన్ననలు పొందారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, నర్సరీలు, ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులతోపాటు మౌలిక వసతుల కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతకుముందు సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను లేవనెత్తారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఆ పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించాలని సర్పంచ్‌లు వేడుకున్నారు. అనంతరం సర్పంచులను జడ్పీ చైర్పర్సన్ శాలువాలతో సన్మానించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం, ఎంపీడీవో మహబూబ్ అలీ, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌తోనే గ్రామాల అభివృద్ధి
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి 1 : మాజీ సీఎం కేసీఆర్‌తోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. గురువారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను అందించడంతోపాటు డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. వ్యవసాయరంగానికి కేసీఆర్ పెద్దపీట వేశారని, రైతులకు రైతుబంధు, రైతు బీమా అందించినట్లు తెలిపారు.అనంతరం సర్పంచ్‌లను శాలువాలతో సన్మానించి మెమోంటోలు అందజేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, తహసీల్దార్లు అనంతరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

