పాపన్నపేట, మే15 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి పెద్ద సంఖ్యలో నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయలలో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు, సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏడుపాయల ఆలయ ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది సూర్యశ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, రవికుమార్, నరేశ్, మహేశ్ తగు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పాపన్నపేట ఎస్సై విజయ్‌కుమార్ తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.