జహీరాబాద్, మే 10: మాకు 60 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉండే ది. ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచే దేశసేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్మీలో చేరారు. 1995 నుంచి 2019 వరకు భారత ఆర్మీలో వివిధ ప్రాంతాల్లో పనిచేశాను. ఏసీపీ నాయక్ సుబేదారు ర్యాంకు హోదాలో రిటైర్డు అయ్యాను. నేను ఆర్మీలో చేరిన కొత్తలో 1996లో కార్గిల్ యుద్ధం జరిగింది. అప్పుడు కశ్మీర్ ప్రాంతంలోని కుప్వారా సెక్టార్లో విధులు నిర్వహించాను.
ఆ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత ఏడాది పాటు రాజస్థాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహించి పాకిస్థాన్ దాడులను తట్టుకున్నాను. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యాను. పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం చాలా బాధాకారం. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మనందరికీ గర్వకారణం. త్రివిధ దళాలకు అందరం మద్దతుగా నిలవాలి.
– దేవరాజ్, ఏసీపీ నాయక్ సుబేదార్ రిటైర్డ్, ధనసరి గ్రామం, మొగుడంపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా)