చిన్నశంకరంపేట/మెదక్ రూరల్, అక్టోబర్ 22: అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనాలని, పంట దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్, చిన్నశంకరంపేట మండలా ల్లో ఆమె పర్యటించారు. సూరారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం భాగీర్థిపల్లిలో నిర్వహించిన రేణుకాఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. అనంతరం చందంపేట సహకార సంఘం చైర్మన్ సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. మెద క్ మండలంలోని ఔరంగాబాద్, ఔరంగాబా ద్ తండా అవుసలపల్లిలో తడిసిన ధాన్యం రాశులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అకాల వర్షంతో తడిసి న ధాన్యాన్ని కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొలకెత్తిన ధా న్యం కొనుగోలు చేయకుంటే రైతుల తరఫున పోరాడుతామన్నారు. అనేక హామీలు ఇచ్చిన రైతులను కాంగ్రెస్ నిలువుగా మోసం చేసిందని ఆరోపించారు. రైతుబంధు వేస్తామని చెప్పి వేయకుండా మోసం చేసిందన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఇవ్వడం లేదన్నారు. బతుకమ్మ చీరలను అందించలేదన్నారు. ధాన్యం వస్తున్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం సేకరణ లో ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల నాయకులు లక్ష్మారెడ్డి, నాగరాజు, దయానంద్‌యాదవ్, లక్ష్మణ్, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ నాయకులు మాజీ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మార్కెట్ కమి టీ మాజీ చైర్మన్ జగపతి, మెదక్ మం డలాధ్యక్షుడు అంజాగౌడ్, కౌన్సిలర్లు కిశోర్, జయరాజ్, రాజ్‌పల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.