కమ్మేసిన మంచుదుప్పటి
ఉమ్మడి జిల్లాను మంచుదుప్పటి కప్పేసింది. ఆకాశం నుంచి మేఘాలు దిగివచ్చినట్లుగా మంచు కురిసింది. చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదభరితంగా మారింది. పల్లెల్లో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలైనా మంచు తెరలు తొలిగిపోలేదు. ఉదయం పనులు చేసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు.
- సూర్యోదయమైనా వీడని పొగమంచు
- ఉదయం తొమ్మిది గంటలైనా తొలగని మంచుతెరలు
- ఇబ్బందులు పడిన వాహనదారులు
- వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
ఉమ్మడి జిల్లాను మంచుదుప్పటి కప్పేసింది. ఆకాశం నుంచి మేఘాలు దిగివచ్చినట్లుగా మంచు కురిసింది. చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదభరితంగా మారింది. పల్లెల్లో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలైనా మంచు తెరలు తొలిగిపోలేదు.

ఉదయం పనులు చేసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లాల్సి వచ్చింది. రోజురోజుకూ పెరుగుతున్న చలి కారణంగా శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు, చిన్నారులు ఉదయం వేళల్లో బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
– ఉమ్మడి జిల్లా నెట్వర్క్, డిసెంబర్ 8

ఉమ్మడి జిల్లాను శుక్రవారం పొగమంచు కమ్మేసింది. ఉదయం 10గంటలు దాటినా మంచుమూలంగా ఎవరూ బయట కనిపించలేదు. మంచు, చలితో అన్నదాతలు సైతం పొలాలకు వెళ్లకుండా ఇండ్లలోనే ఉండిపోవాల్సిన వచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భానుడు కలిపించలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. పొద్దంతా మబ్బులతో నిండి ఉండడంతో ఎప్పుడు రద్దీగా ఉండే పట్టణాలతోపాటు గ్రామాలన్నీ బోసిపోయాయి.

మంచుతోపాటు చిన్నపాటి చినుకులు సైతం కురవడంతో ధాన్యాన్ని ఆరబోసిన రైతులు ఒకేచోటికి తరలించి టార్పాలిన్లు కప్పారు. పొగమంచు మూలంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యవసరమైతే తప్పా మంచు తగ్గే వరకు ప్రయాణాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎదురుగా వచ్చే వాహనాలు, మూల మలుపులు, రోడ్డు కూడా సరిగ్గా కనిపించక పోవడంతో హెడ్లైట్లు వేసుకొని ప్రయాణించాల్సి వచ్చింది.

– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 8
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

