సిద్దిపేట, డిసెంబర్ 25 : దివ్యాంగులకు అం డగా నిలిచి, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో లయన్స్, అలయన్స్, వాసవి క్లబ్‌ల ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు అభయ జ్యోతి సంస్థ ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్న నేత కేసీఆర్ అన్నారు. దివ్యాంగులకు రూ.4వేల పింఛన్ ఇచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌ది అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల రూ.6వేల పింఛన్ వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మానసిక దివ్యాంగుల కోసం అభయజ్యోతి స్వచ్ఛంద సంస్థ సేవలు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అభయజ్యోతి మానసిక దివ్యాంగుల సంస్థ భవనం కోసం తన వంతు సహాయం అందిస్తానన్నారు. అభయజ్యోతి, లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అయన్స్ క్లబ్ ప్రతినిధులు వినోద్మెదాని, ఈశ్వరయ్య, రమేశ్, గంప శ్రీనివాస్, అభయజ్యోతి నిర్వాహకులు జోజి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, నాయకులు పాలసాయిరామ్, ఆడ్డగట్ల శేఖర్, అంజి పాల్గొన్నారు.