అమీన్పూర్, ఫిబ్రవరి 12: తెలంగాణలో మరో 20 ఏండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగుతుందని, పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతవడం ఖాయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు 300 మంది, ఇతర పార్టీల కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ నాయకులు, సభ్యులు పెద్ద మొత్తంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలే కాకుండా దేశ ప్రజలు సైతం సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులవుతున్నారని, దేశవాప్తంగా కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చుతూ బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతారన్నారు. బీఆర్ఎస్ దేశంలోనే తిరుగులేని అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కారు హయాంలోనే అమీన్పూర్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. తమపై నమ్మకంతో బీఆర్ఎస్లో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చేరికలను ప్రోత్సహించిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, స్థానిక కౌన్సిలరు మహదేవరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నర్సింహ్మగౌడ్, కౌన్సిలర్లు కల్పనా ఉపేందర్‌రెడ్డి, రాజేశ్వరి, అమీన్పూర్ బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బాల్‌రెడ్డి, నాయకులు జగదీశ్వర్, గోపాల్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సువర్ణ వ్యాలీ, స్వర్ణపురి కాలనీలకు ఉపయోగపడే విధంగా రూ.15 లక్షలతో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించారు. పార్కు పనులు ప్రారంభించినందుకు ఆయా కాలనీల ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.