పాపన్నపేట, నవంబర్ 2 : దేశంలో 24 గంటలు కరెంట్ ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మెదక్ బీఆర్ఎస్ అభ్య ర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. పాపన్నపేట మండ లపరిధిలోని వివిధ గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా కొత్తపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మండలంలోని అరికెల, తమ్మాయిపల్లి, సీతానగర్, బాచారం, ఎంకెపల్లి, చిత్రియాల్, కొడుపాక గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 గంటల పాటు కరెంటు ఇవ్వలేదన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని అనడం న్యాయమేనా అని ప్రశ్నించారు. ఇంకో నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతు బంధు పథకాన్ని బంద్ చేస్తామంటున్నారని, ఇది రైతులకు అన్యాయం చేయడమేన్నారు.
ప్రజా వ్యతిరేకంగా వ్యవహరి స్తున్న కాంగ్రెస్‌ను తెలంగాణలో బంద్ చేయాలని ప్రజలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రైతు బంధు పథకం ప్రవేశపెట్టామని, తిరిగి అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.16,000 ఇవ్వన్నట్లు పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.2 వేలు ఇస్తున్న పెన్షన్‌ని అధికారంలోకి రాగానే రూ. 5000లకు పెంచుతామన్నారు. బీఆర్ఎస్ని గెలిపిస్తే రూ.400 గ్యాస్ సిలిండర్ ఇస్తామని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ పాలనలో మెదక్ ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. గతంలో ఘనపూర్ ఆనకట్టకు సింగూర్ నీరు రావాలంటే రైతులు రాస్తారోకో, ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. సీఎం కేసీఆర్ సింగూర్ నీటిని కేవలం మెదక్ జిల్లాకే వాడుకునేలా జీవో తెచ్చారని ఎమ్మెల్యే వివరించారు. మైనంపల్లి వంటి నాయకులు ఓట్ల కోసం తోచిన హామీలు ఇస్తారని, వాటిని నమ్మవద్దని సూచించారు. ప్రజా సమస్యలను పరిష్క రిస్తున్న బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను పద్మాదేవేందర్ రెడ్డి కోరారు. పాపన్నపేట మండలంలో ఎమ్మెల్యేకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుమ్మరి జగన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, నాయకులు సోములు, శ్రీనివాస్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఆంటోని, దుర్గయ్య, వెంకటేశం ఉన్నారు.
గాజులగూడెం చర్చిలో పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిత్రియాల్ గ్రామంలో కాంగ్రెస్ పారీకి చెందిన 50 మంది యువకులు పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.