మర్కూక్, జూన్ 21: ఆచార్య జయశంకర్ స్ఫూర్తితోనే కేసీఆర్ తెంగాణ ఉద్యమం నడిపించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణ సాధించిన గొప్పనాయకుడు కేసీఆర్ అన్నారు.
ఉమ్మడి ఏపీ పాలనలో తెలంగాణ ఎడారిని తలపించేదన్నారు. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ నిర్మించారన్నారు. ప్రజల సాగు, తాగునీటి ఇబ్బందులు తొలిగించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆరేండ్లు అవుతున్న సందర్భంగా కొండపోచమ్మ ప్రాజెక్టులో గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చని పొలాలు కనిపిస్తున్నాయన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మండుటెండల్లో కేసీఆర్ రైతులకు సాగునీరు అందించారని గుర్తుచేశారు. రాష్ర్టానికి అన్నం పెడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై నిందలు మోపడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రామచంద్రం, పాండుగౌడ్, మ్యాకల కనకయ్య, బట్టు సుధాకర్‌రెడ్డి, సాయిని మహేశ్, కిరణ్‌గౌడ్, నూనె కుమార్, రాజమౌళి, అర్జున్‌గౌడ్, ఇంద్రసేనారెడ్డి, అచ్చంగారి భాస్కర్, మద్ది రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.