రామాయంపేట, జూలై 19 : రామాయంపేట పురపాలిక పరిధిలోని కోమటిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు. కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులకు తాగునీరు రాకపోవడం బాధించిందన్నారు.
జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అనంతరం విద్యార్థుల హాస్టల్ గదులను, బాత్రూమ్లను పరిశీలించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో కొంత ఇబ్బంది కరంగానే ఉందన్నారు. తహసీల్దార్ వెంట ఆర్ఐ.గౌస్ తదితరులు ఉన్నారు.