సిద్దిపేట కమాన్, ఫిబ్రవరి 5: సిద్దిపేట పట్టణంలోని డీఆర్సీసీ, స్వచ్ఛబడిని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, డాక్టర్ దశరథ్‌రామ్(సీఈవో) బుధవారం సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ అశ్రిత్‌కుమార్ వారికి పూలమొకను అందజేసి స్వాగతం పలికారు. డీఆర్సీసీ నిర్వహణ తీరును కమిషనర్ వారికి వివరించారు. మున్సిపల్ చెత్త సేకరణ వాహనం ఉదయమే వార్డుల్లో ఇంటింటికీ వెళ్తూ చెత్త సేకరణ చేస్తారని, ప్రతి మంగళ, శుక్రవారం పొడి చెత్త, ఇతర వారాల్లో తడి చెత్తను సేకరిస్తారని తెలిపారు. ప్రజలు తడి, పొడి, హానికర చెత్తను అందించేలా ఇంటింటికీ సిబ్బంది వెళుతూ అవగాహన కల్పించారని తెలిపారు.
తడి చెత్త ద్వారా బుస్సాపూర్ రిసోర్స్ పార్లో బయోగ్యాస్, సేంద్రియ ఎరువు తయారీ చేసి రైతులకు తకువ ధరలో విక్రయిస్తామన్నారు. బయోగ్యాస్‌ను పట్టణంలోని హరిత, అక్షయ వంటి హోటల్‌కు సరఫరా చేస్తున్నామన్నారు. పొడి చెత్తతో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నామని చెప్పారు. డీఆర్సీసీలో పొడి చెత్త సేకరణ విధానం, సేకరించిన పొడి చెత్త విభజించు విధానం, పొడి చెత్తను కాంప్లెక్స్ చేసే విధానాన్ని వారు పరిశీలించారు. అనంతరం పట్టణంలోని స్వచ్ఛబడిలో డిజిటల్ తరగతి గదిలో ఇంటింటా చెత్త సేకరణ చేయు విధానం, పట్టణంలోని మౌలిక సదుపాయాల నిర్వహణ వంటి వాటిని ప్రొజెక్టర్ ద్వారా వీక్షించారు. స్వచ్ఛబడిలో ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన ప్లాస్టిక్ టైల్స్‌ను పరిశీలించారు. స్వచ్ఛ బడిలో తడి చెత్త ద్వారా తయారవుతున్న సేంద్రియ ఎరువు తయారీ విధానం గురించి కమిషనర్ వివరించారు. అనంతరం సీడ్ బ్యాంక్, స్టీల్ బ్యాంక్, జూట్ క్లాత్ బ్యాంక్‌లను పరిశీలించారు. వారి వెంట కౌన్సిలర్ దీప్తీనాగరాజు, ఉమాకాంత్ (ఐటీసీ జీఎం) రాజు, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.