ఏ ఊరి అవ్వనో..?
ఎక్కడికెళ్లొచ్చిందో తెలియదు.. ఉలుకదు, పలుకదు మారుమాట అనదు. ఆకలేస్తే అడుక్కుంటది. పెడితే తింటది. లేకుంటే ఊకుంటది. ఒక్కసారే చేయిచాచి అడుగుతది. దానం చేసే దాత చూడకపోయినా, పెట్టకపోయినా క్షణం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోతది. పాత బట్టయినా, గుడ్డ పేలికయినా చుట్టుకుంటది.
- ఐదు నెలలుగా బస్టాండే ఇల్లు
- హృదయవిదాకరం.. ఈ వృద్ధురాలి దీనస్థితి
- మతి స్థిమితం లేని మహిళగా అనుమానం
- తోచింది పెడుతూ ఆకలి తీరుస్తున్న స్థానికులు
ఎక్కడికెళ్లొచ్చిందో తెలియదు.. ఉలుకదు, పలుకదు మారుమాట అనదు. ఆకలేస్తే అడుక్కుంటది. పెడితే తింటది. లేకుంటే ఊకుంటది. ఒక్కసారే చేయిచాచి అడుగుతది. దానం చేసే దాత చూడకపోయినా, పెట్టకపోయినా క్షణం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోతది. పాత బట్టయినా, గుడ్డ పేలికయినా చుట్టుకుంటది. నిత్యం పొద్దుమాపు రెండు స్నానాలు! ఊరు పేరు చెప్పదు, తనవారి పేరు చెప్పదు. వర్గల్ మండలం శాకారం బస్టాండ్లో తలదాచుకున్న ఓ మతి స్థిమితం లేని అవ్వ కథ ఇది!!
వర్గల్, మే 6: సుమారు ఐదు నెలల క్రితం మతి స్థిమితం లేని ఓ వృద్ధురాలు వర్గల్ మండలం శాకారం గ్రామానికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎట్లా వచ్చిందో తెలియదు కానీ, 4 నెలలుగా ఇక్కడే ఉంటోంది. శాకారం బస్టాండ్ చౌరస్తా నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగించే జన సమ్మర్థ ప్రాంతం. ఎవరు ఎటు ప్రయాణం చేస్తారో తెలియదు. గంటల తరబడి అక్కడే ఉంటున్న ఓ అవ్వను చూసిన ఆ ఊరివాళ్లు మాటామాటా కలిపారు.

ఆమె నుంచి ఉలుకూపలుకు లేకపోవడంతో ఇంత బువ్వ పెట్టారు. ఇలా రోజులు గడిచాయి.. నెలలు గడుస్తున్నాయి. తనవారు రాలేక, నా అనేవారు ఎవరో తెలియని మతి స్థిమితం లేని ఆ అభాగ్యురాలు ఇక్కడే కాలం వెళ్లదీస్తోంది. గ్రామానికి చెందిన ధన్రాజ్ గౌడ్, మక్బుల్ తమకు తోచిన ఆహారం అందిస్తుండడంతో కడుపు నింపుకొంటున్నది. దాతృత్వం గలవారెవరైనా ఆమె అడ్రస్ తెలుసుకొని స్వస్థలానికి చేరవేస్తే తనవాళ్లను చూసుకుంటుందని దారిన పోయేవాళ్లు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

