జగదేవపూర్ సెప్టెంబర్10: బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డిని బుధవారం పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి,మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, రైతు బంధు సమితి సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు వంగనాగిరెడ్డి, పలువురు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వంటేరు స్వగృహం సిద్దిపేట జిల్లా దౌలాపూర్‌లో వేర్వేరుగా ఆయన్ను కలిసి వజ్రమ్మ చిత్రప టం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళుల ర్పించారు.
అనంతరం వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఆయన సోదరులు శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డిని పరామర్శించి సంతా పం తెలిపారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ జగదేవపూర్ మండల అధ్యక్షుడు అయిలయ్య , బీజేపీ నాయకుడు జశ్వంత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సత్తయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాదవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరెడ్డి, ఉపేందర్‌రెడ్డి వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.