మెదక్, మే 8 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 3,85,484 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,93, 124 మంది కాగా, మహిళలు 2,02,370 మంది ఉన్నారు. ఇందులో 36 వేల మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, మరో 36 వేల మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు.
ఇదిలా ఉండగా, సోమవారం 71వ రోజు జిల్లావ్యాప్తంగా 29 బృందాలు పాల్గొనగా, 4269 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 226 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, 255 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చామని డీఎంహెచ్వో చందునాయక్ తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చూస్తున్నామని చెప్పా రు. కంటి వెలుగు శిబిరాల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని తెలిపారు.