టేక్మాల్ : మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలోని గాంధీభవన్లో త్రిపుర ఏజెన్సీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర అనిర్వచనీయమైందన్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫోర్స్ స్థాపించి బ్రిటిష్ గుండెల్లో రైలు పరిగెత్తేలా చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, మజాహర్, మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, మాజీ కో-ఆపరేటివ్ డైరెక్టర్ విద్యాసాగర్, భక్తుల కిషోర్, రాజు, అనీల్, సాయి శేషు గౌడ్, చింతా శివ, సాయి ఉన్నారు.