రామాయంపేట, ఆగస్టు 12: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని టీఎస్ బాలుర గురుకుల విద్యాలయం సమస్యలతో కొ ట్టుమిట్టాడుతున్నది. సరిపడా టీచర్లు ఉన్నా రోజురోజుకు సమస్యలు తీవ్రమవుతున్నాయి. సరిపడా భవనాలు లేక విద్యార్థులు చదువుకునే చోటే నిద్రించాల్సి వస్తున్నది. 10, 11తరగతుల విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్న ప్రభుత్వం ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయి.
విద్యార్థులు చదువుకోవడం కోసం డార్మెటరీ భవనం లేక తినడం ఒకచోట, చదువుకోవడం ఒకచోట, పండుకోవడం మరోచోట ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. గురుకులంలో వంట కార్మికులు ఉన్నా విద్యార్థులే వడ్డించుకొని తిన్సాలిందే. విద్యార్థులు తినడానికి డైనింగ్ రూములు లేక పాఠశాలలోని నేలపైనే (ఇరుకుగది) సామూహికంగా అన్నం తినాల్సిన పరిస్థితి నెలకొన్నది. గురుకులంలో క్వార్టర్లు లేక టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు.
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ప్రస్తుతం 5, 9 తరగతుల విద్యార్థులకు డార్మెటరీ భవనం లేక కొంత ఇబ్బంది ఉన్నది. టీచర్ల నివాసం కోసం క్వార్టర్లు లేక మరికొంత ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్యలపై ప్రభుత్వ అధికారులకు నివేదికలు సమర్పించాం.త్వరలోనే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం
– మురళి, తూప్రాన్ గురుకుల ప్రిన్సిపాల్, మెదక్ జిల్లా