Drugs | మెదక్ రూరల్, నవంబర్ 18 : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జెడ్పీసీఓ ఎల్లయ్య అన్నారు. మంగళవారం మెదక్ పట్టణ కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జెడ్పీసీఓ ఎల్లయ్య, ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలు లేని భారతదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి నషా ముక్త్ అభియాన్ పథకం ప్రవేశ పెట్టిందని తెలిపారు.
మత్తు పదార్థాలకు బానిస అయితే జీవితాలను కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని.. వాటికి దూరంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరం ఉండాలని సూచించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు తెల్లకాగితం లాంటివారని మంచి అలవాట్లు అలవర్చుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి పదార్థాలు ఎవరైనా సేవిస్తే , విక్రయించినా , రవాణా చేసినా సమాచారాన్ని 1098 , 14446 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు.
మత్తు పదార్థాలు లేని జిల్లాగా..
మత్తు పదార్థాలు లేని మెదక్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు యువత సహకరించాలన్నారు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ జైలు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల యువత విద్యలో రాణించలేకపోతున్నారని అన్నారు. దానివల్ల తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులను బాధకు గురి చేసే వారం అవుతున్నామని అన్నారు.
అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీవితాలను ఎలా కోల్పోతున్నారన్న దృశ్యాలను కండ్లకు కట్టినట్టు చూపించారు. మత్తు పదార్థాలకు సంబంధించి యువతతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ముస్తాక్ అహ్మద్ , డీడబ్ల్యుఓ ఈవో ప్రియాంక, హెడ్ కానిస్టేబుల్ సురేందర్, జనార్దన్, రవీందర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Ambulance Catches Fire | మంటల్లో అంబులెన్స్.. నవజాత శిశువు, వైద్యుడు సహా నలుగురు సజీవదహనం
KTR | 21న జాతీయ రహదారుల దిగ్బంధం.. భారీగా తరలిరావాలని అన్నదాతలకు కేటీఆర్ పిలుపు
Narayana Murthy | చైనా ఫార్ములాలో.. యువత 72 గంటలు పనిచేయాలి : ఇన్ఫీ నారాయణమూర్తి