వర్గల్,మార్చి 9: పరీక్షలకు బాగా చదువుకోమని తల్లి మందలించడంతో విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహ త్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. గౌరారం ఎస్సై కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చాంద్‌ఖాన్‌మక్త గ్రామానికి చెందిన మర్కంటి గోపాల్‌రెడ్డి, కనకవ్వ దంపతుల కుమారుడు మర్కంటి విజయేందర్‌రెడ్డి(16) చౌదర్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో పదో తరగతి చదువుతున్నాడు.
ఈనెల 6న కనకవ్వ పొలం వద్ద ఉండగా విజయేందర్‌రెడ్డి ఆమె వద్దకు వెళ్లాడు. పరీక్షలు పెట్టుకుని కుమారుడు సమయ వృథా చేస్తూ తిరుగుతుండడంతో తల్లి మందలించింది. దీంతో విజయేందర్‌రెడ్డి చేనులో ఉన్న పరుగుల మందు తాగాడు. గమనించిన కనకవ్వ ఇరుగు పొరుగు వారి సాయంతో కుమారుడికి గజ్వేల్ ప్రభత్వ దవాఖానకు తరలించింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించగా, శనివారం అర్ధరాత్రి ఆరోగ్యం విషమించి మరణించాడు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తునట్టు ఎస్సై తెలిపారు.