గజ్వేల్, ఆగస్టు 9: డెంగీతో ఏడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీలోని పల్లెపహాడ్లో చోటుచేసుకున్నది. వి వరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శివలింగుస్వామి, కవి త దంపతుల కుమారుడు బన్నీ(11) ఎటిగడ్డకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం అతడు తీవ్ర జ్వరంతో బాధపడుతుండ గా తల్లిదండ్రులు గజ్వేల్లోని ప్రైవే ట్ దవాఖానకు తీసుకెళ్లారు.
అక్కడి వైద్యులు బన్నీని పరీక్షించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం సిద్దిపేటకు తీసుకెళ్లాలని తెలుపగా సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అందరితో కలుపుగొలుపుగా ఉండే బన్నీ మృ తి చెందిన విషయం తెలువడంతో తోటి స్నేహితులు, బంధువులు, శోకసంద్రంలో మునిగిపోయారు. శుక్రవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు బన్నీ డెంగీతో మృతి చెందిన విష యం తెలువడంతో సంతాపం తెలిపి సెలవు ప్రకటించారు.