సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు కంపు కొడుతున్నాయి. కొన్నిచోట్ల టాయిలెట్లకు తాళాలు వేసి ఉంచగా మరికొన్ని శుభ్రంచేసేవారు లేక అధ్వానంగా తయారయ్యాయి. పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, రైతు బజార్, కోటిలింగాల దేవాలయం, ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న టాయిలెట్లు దారుణంగా మారాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు ఆ టాయిలెట్లు ఉపయోగించుకోలేక వేరే ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి టాయిలెట్లను శుభ్రం చేయించడంతో పాటు వాటి నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
– నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట జిల్లా, మే10