రామచంద్రాపురం, ఫిబ్రవరి 26: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 42వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఆర్చరీ చాంపియన్స్ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో 150 మంది ఆర్చర్స్ పాల్గొన్నారు. బాలబాలికల విభాగం నుంచి మూడు దశల్లో ఎంపికచేశారు. జాతీయ స్థాయి పోటీలకు 24 మంది ఆర్చర్లు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ పోటీలను ప్రిన్సిపాల్ సీజే వసంత ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పోటీల్లో ఎంపికైన వారు గుజరాత్ రాష్ట్రంలో మార్చిలో జరిగే జాతీయస్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో ఆడుతారన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ఆర్చర్స్గా తయారు చేసేందుకు తెలంగాణ అర్చరీ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి ఆర్చరీ సెలక్షన్స్‌కు డీపీఎస్ వేదిక కావడం గర్వకారణమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు విలువిద్యలోనూ ప్రావీణ్యం సంపాదించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీపీఎస్ మేనేజర్ దేవ్‌సింగ్, ఆర్చరీ కోచ్ బండి స్వామి, కోశాధికారి పుట్ట శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.