రామాయంపేట, మార్చి 10: ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని మెదక్ జిల్లా క్రీడల శాఖ అధికారి నాగరాజు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ అన్నారు. ఆదివారం రామాయంపేట పట్టణంలోని మెదక్ రోడ్డు బైపాస్ వద్ద సైక్లింగ్ క్రీడలను వారు ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
రాష్ట్రస్థాయి సైక్లింగ్‌లో పట్టణానికి చెందిన ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ద్వితీయ స్థానంలో రామాయంపేట విద్యార్థులు ముగ్గురికి వెండి పతకాలు లభించినట్లు నిర్వాహకుడు దండు యాదగిరి తెలిపారు. కార్యక్రమంలో సైక్లింగ్ జాతీయ అవార్డు గ్రహీత దండు యాదగిరి, ప్రసాద్, సుభాష్‌చంద్రబోస్, సతీశ్‌రావు, దామోదరరావు, శ్రీకాంత్‌శర్మ, సంతోష్, తిరుపతిగౌడ్, రమేశ్, వేణు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.