నారాయణఖేడ్, ఏప్రిల్ 13: నిరుద్యోగులు బా గుపడాలనే ఉద్దేశంతో నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఎంబీఆర్ ఫౌండేష న్ ఆధ్వరంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని, ఉద్యోగాలు సాధించి పేరు నిలబెట్టాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి సూచించారు. గ్రూప్స్, పంచాయతీ కార్యదర్శి, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగా ల కోసం నిరుద్యోగులకు ఎమ్మె ల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సొంత ఖర్చు తో జూకల్ శివారులోని కన్వెన్షన్ సెం టర్లో ఏర్పాటు చేసిన శిక్షణ కేం ద్రాన్ని బుధవా రం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మా ట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రకటన చేసిందని, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిరుద్యోగుల పరిస్థితిని అర్థం చేసుకుని, ఎమ్మెల్యే ఉచిత శిక్షణ, భోజన వసతి, మెటీరియల్ అందజేస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎంబీఆర్ ఫౌండేషన్ అధినేత మహారెడ్డి రోషన్‌రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సహకారంతో ఎంబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా శిక్షణనిచ్చే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే సుమారు 800 మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, ఆత్మ చైర్మన్ రాంసింగ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అలీ, డీఎస్పీ సత్యనారాయణరాజు, జడ్పీటీసీలు లక్ష్మీబాయి, నర్సింహారెడ్డి, రాఘవరెడ్డి, రాజునాయక్, మాజీ సర్పంచ్ ఎం.ఏ.నజీబ్, జూనీయర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణకుమార్, నాయకులు మూడ రాంచందర్, రమేశ్చౌహాన్, అభిషేక్‌శెట్కార్, మోహన్‌రెడ్డి, సత్యపాల్‌రెడ్డి, దుర్గారెడ్డి, అంజాగౌడ్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.
– ఎస్పీ రమణకుమార్
నారాయణఖేడ్ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఇది సువర్ణావకాశమని, దీనిని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని ఎస్పీ రమణకుమార్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. శిక్షణకు హాజరయ్యే వారికి పోలీస్‌శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని, శారీరక శిక్షణ ఇస్తామన్నారు.