మెదక్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీల చట్టాలపై అవగాహన కల్పించాలని, ఎస్సీ,ఎస్టీల పెండింగ్ కేసులు పరిషరించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెం కటయ్య అన్నారు. శనివారం మెదక్ కలెక్టరేట్లో ల్యాండు, అట్రాసిటీ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌తోపాటు సభ్యులు రాంబాబునాయక్, లక్ష్మీనారాయ ణ, శంకర్, మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ అభివృద్ధి అధికారి శశికళ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలోనే ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవుతున్నాయన్నారు.
మెదక్ పట్టణంలో దుకాణా సముదాయాలు అర్హులైన లబ్ధిదారులకు కాకుండా బినామీల మీద ఉన్నాయని ఎస్సీ కార్పొరేషన్‌కు ఫిర్యాదు వచ్చిందన్నారు. వారం రోజుల్లో దానిపై పూర్తి నివేదిక అందజేయాలని సూచించారు. రా మాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్, శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లి గ్రామా ల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించారని, హవేలీఘనపూర్ మండలం శమ్నాపూర్‌లో దళిత మహిళను వినాయకుడికి కొబ్బరికాయ కొట్టనివ్వలేదని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
ఎస్సీ,ఎస్టీల మీద దాడి చేసినప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వవద్దని జిల్లా ఎస్పీకి సూచించారు. కేసు తీవ్రతను బట్టి శిక్ష పడే విధంగా చూడాలని, క్రిమినల్ కేసులు పెట్టి కోర్టుకు పంపాలని తెలిపారు. ప్రతి నెలా పౌర హకుల దినోత్సవం జరపాలన్నా రు. మెదక్ పట్టణంలో అంబేదర్ విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్టించాలన్నారు. ఎస్సీ,ఎస్టీలపై దాడులు అరికట్టాలని, బాధితులకు త్వరగా నష్ట పరిహారం అందించాలని సం బంధితశాఖల అధికారులను ఆదేశించారు. గౌతోజీగూడలో జరిగిన సంఘటనలో నిందితులను అరెస్టు చేయాలని, అకడ సహపంక్తి భోజనం ఏర్పాటు చేయాలన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ కులం, మతం పేరుతో ఎవరైనా దూషిస్తే మా దృష్టికి తీసుకురావాలన్నారు. పంచాయతీల్లో పౌర హక్కుల డే జరిపిస్తామన్నారు. కార్యక్రమం లో అధికారులు, ఆర్డీవోలు, మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని, తొలిగించిన అంబేదర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని చైర్మన్‌ను డీబీఎఫ్ నేతలు కోరారు.
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 28: నేటి బాలలే రేపటి పౌరులని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మెదక్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. ఆయన వెంట కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, లక్ష్మీనారాయణ, శంకర్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,అధికారులు ఉన్నారు.