మనోహరాబాద్, సెప్టెంబర్ 28: సాంఘిక బహిష్కరణలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య ఆదేశించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో శనివా రం బాధితుల ఇంటికెళ్లి (నర్సమ్మ, చంద్రం, అర్జున్ కుటుంబ సభ్యుల ను)పరామర్శించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. చట్టం ముందు అందరూ సమానులేనన్నా రు. ప్రధాన నిందితులను అరెస్ట్ చే యాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్, రాంబాబునాయక్, దళిత బహుజనఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్, ప్రధానకార్యదర్శి నర్సింహ, డీబీఎఫ్ నేతలు స్వామి, వేణు పాల్గొన్నారు.