చిలిపిచెడ్, సెప్టెంబర్ 11: చిలిపిచెడ్ మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులనుపై గురువారం ఎంపీడీవో కార్యాలయం వద్ద డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ సోషల్ ఆడిట్ నిర్వహించారు. 2024 ఏప్రిల్ ఒకటి నుండి 2025 మార్చి 31 వరకు మండలంలోని 19 జీపీలో చేపట్టిన వివిధ పనులపై నివేదికలు చదివి వినిపించారు. ఉపాధి కూలీలు హాజరు లేకుండా పేమెంట్ జరిగిందని అలా జరగకుండా చూడాలని డిఆర్డిఏపిడి ఆదేశించారు.
ఉపాధి హామీ కూలీ పనిచేసిన మాస్టర్ల పై సంతకాలు చేశారో లేదో చూడాలన్నారు. అన్ని జిపి లలో సిటిజన్ చార్జీలు ఏర్పాటు చేయాలని, ఒకరు బదులు ఒకరు పని చేయవద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ రాజేందర్ రెడ్డి, సీనియర్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ జ్యోతి, విజిలెన్స్ ఆఫీసర్ శ్రీహరి, స్టేట్ టీం మేనేజర్ అంజగౌడ్,ఎంపీడీవో ప్రశాంత్, ఎస్ఆర్పి నర్సయ్య, ఏపీవో శ్యామ్, ఈసీ భగవాన్ రెడ్డి, పిఆర్ఏఈ మారుతి, జిపి కార్యదర్శులు, టిఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.