శ్రీనివాస్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు
జక్కపల్లి మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుప్తల శ్రీనివాస్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ దుప్తల శ్రీనివాస్ (50) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు.
- మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- భౌతికకాయానికి నివాళి, కుటుంబ సభ్యులకు పరామర్శ
నర్సాపూర్, జూన్ 24: జక్కపల్లి మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుప్తల శ్రీనివాస్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ దుప్తల శ్రీనివాస్ (50) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాస్ మరణవార్త వినగానే హరీశ్‌రావు గ్రామానికి చేరుకుని భౌతిక ఖాయానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్లో ఉంటూ పార్టీకి విశేష సేవలు అందిస్తూ, క్రియశీలక పాత్ర పోషించాడన్నారు. శ్రీనివాస్‌తో ఉన్న పరిచయాన్ని మాజీ మంత్రి నాయకులతో పంచుకున్నారు. శ్రీనివాస్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆదివారం సాయంత్రం చాతిలో నొప్పిగా ఉందని, పక్క గ్రామం చిప్పల్తుర్తి ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరకు చికిత్స కోసం వెళ్లాడు. నొప్పి తీవ్రత పెరగడంతో దవాఖానలోనే శ్రీనివాస్ కుప్పకూలాడు. హుటాహుటిన నర్సాపూర్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. శ్రీనివాస్‌కు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు, కూతురు ఉన్నారు. సర్పంచ్‌గా శ్రీనివాస్ ఒకసారి, ఆయన భార్య వెంకటలక్ష్మి రెండుసార్లు ప్రజలకు సేవలందించారు. శ్రీనివాస్ మంచితనాన్ని, సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ గ్రామస్తులు, నాయకులు కన్నీరుమున్నీరయ్యారు.
నివాళులర్పించిన పలువురు
ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ ఎంపీపీ వెంకటనర్సింరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకులు గోపి, లక్ష్మణ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ఛత్రునాయక్, రాజుయాదవ్, మల్లేశ్‌గౌడ్ నివాళులర్పించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

