మెదక్ మున్సిపాలిటీ, జనవరి 20 : జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా టీఎల్ఎంతోపాటు ఉపాధ్యాయుల విద్యాబోధనను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మా ట్లాడి, అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించారు. పాఠశాల రికార్డులను పరిశీలించి, తగిన సలహాలు, సూచనలు చేశారు. ‘మనఊరు-మనబడి’లో చేపట్టిన వాటర్ సంపు, వంట గది నిర్మాణాలను పరిశీలించారు. జిల్లా విద్యాధికారి వెంట ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఉన్నారు.
నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేయాలి
ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన ‘మన ఊరు- మనబడి’ పనులను వేగవంతం చేయాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలకు చెందిన సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు, ఎంఎస్సీ చైర్మన్లు, హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మండలాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టిన ‘మన ఊరు- మనబడి’ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని వివరించారు. జనవరి నెలాఖరులోగా పను లను పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించరాదని పనులు పూర్తి చేసినవారికి వెంటనే బిల్లులు చెల్లిస్తామని వివరించారు. ఆయన వెంట ఎంఈవో బుచ్చానాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలి
ప్రతిభా పోటీల్లో పెద్దశంకరంపేట ఆదర్శ పాఠశాల విద్యార్థులు ముందంజలో ఉందని ఎంఈవో బుచ్చానాయక్ అన్నా రు. మోడల్ పాఠశాలలో అడ్మిషన్ల కరపత్రాన్ని ఉపాధ్యాయులలో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వెనుక బడినవారిని గుర్తిం చి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
హెచ్ఎంలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘మనఊరు-మనబడి’ పనులను వేగవంతం చేయాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంఈవో నీలకంఠం అన్నారు. ‘మనఊరు-మనబడి’లో ఎంపికైన పాపన్నపేట, టేక్మాల్ మండలాల్లోని పాఠశాలల హెచ్ఎంలు, సర్పంచ్‌లు, ఎస్ఎంసీ చైర్మన్లు, ఎంపీటీసీలు, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని పాపన్నపేట ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ప్రతి మండలంలో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయని, మొదటగా ‘మనఊరు-మనబడి’ పనులను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో జగదీశ్వర్‌చారి, ఏఈలు గోపాల్, భానుప్రకాశ్, నోడల్ అధికారులు అంజాగౌడ్, శివకుమార్, హెచ్ఎంలు హరిసింగ్, నాగరాజు, ప్రతాప్‌రెడ్డి, నవీన్‌కుమార్, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, కుబేరుడు పాల్గొన్నారు.
పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్..
పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయని.. విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎంఈవో నీలకంఠం సూచించారు. పాపన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతులకు హాజరైన విద్యార్థుల కు సైన్స్ అధికారి రాజిరెడ్డితో కలిసి స్నాక్స్ పెట్టారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు హరిసింగ్, నోడల్ అధికారి అంజాగౌడ్, ఉపాధ్యాయుడు వీరేశం తదితరులు ఉన్నారు.