అమీన్పూర్(జిన్నారం)జూన్26 : కాలనీల్లోని పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్, హెచ్ఎంటీ శిల్పాలేఅవుట్ , పీఎన్ఆర్ కాలనీల్లో రూ.1.51కోట్లతో చేపట్టనున్న పార్కుల అభివృద్ది పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్కుల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా నిధులు కేటాయిస్తున్నామన్నారు. దశలవారీగా పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా నిధులు కేటాయిస్తామన్నారు.
పార్కులు ఆహ్లాదకరంగాఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పార్కుల్లో అనేక చెట్లు ఉండటం వల్ల స్వచ్ఛమైన గాలి రావటంతో పాటు ప్రశాంతకు నిలయంగా మారుతుందన్నారు. పార్కుల్లో ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రదీన్కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నర్సింహగౌడ్ ,మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మహిళా నేత కాటా సునీత, నాయకులు ఉపేందర్‌రెడ్డి, గోపాల్, జగదీశ్, కృష్ణ, బిజిలి రాజు, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.