సంగారెడ్డి, ఆగస్టు 24: సమాజ నిర్మాణానికి యువతే కీలకమని, యువత లక్ష్య సాధనకు పట్టుబిగిస్తే డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టవచ్చని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి జిల్లా కోర్టు వరకు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఫ్రీడం వాక్‌ను ఆయన ప్రారంభించారు.
ఫ్రీడం వాక్‌ను పోలీసు యంత్రాంగం, సహారా దవాఖాన సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించగా పట్టణ ప్రజలు, ఔత్సాహికులు, యువత అధికసంఖ్యలో పాల్గొ ని విజయవంతం చేసినందుకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు యువత ముందుకు రావాలని, చెడు వ్యసనాలకు దూరం గా ఉండాలని పిలుపునిచ్చారు. యువత ఒక లక్ష్మాన్ని పెట్టుకుంటే అమలయ్యే వరకు నిద్రపోరని గుర్తుచేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత కీలకం కావాలని కోరారు.
డి-అడిక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించి యువత లో చైతన్యం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. వీలైతే దేశానికి భారం కాకూడదని, చెడుమార్గంలో నడవడానికి ప్రధాన కారణం సినిమాలేనని, సినిమాలో చూపించే చెడుకు ప్రభావితం కాకుండా దానిలోని నీతిని గుర్తించాలన్నారు. ఒక వ్యక్తి జీవితంలో తొలి 25ఏండ్లు చాలా కీలకమని, కష్టపడి చదివి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నైట్లెతే జీవితం అందంగా ఉంటుందన్నారు. గుట్కా, సిగరెట్ వంటి వాటికి బానిసలైతే సర్వ స్వం కోల్పోవాల్సి వస్తున్నదన్నారు.
యువతపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. భారతదేశ పౌరులుగా పుట్ట డం అదృష్టమని, భారత పౌరులుగా దేశానికి ఏదోరకంగా ఉపయోగపడాలన్నారు. నూతన చట్టాలపై అవగాహన కలిగి మంచి మార్గంలో నడవాలని యువతకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో సహారా దవాఖాన డైరెక్టర్ శం కర్, డీఎస్పీ సత్తయ్యగౌడ్, నార్కోటిక్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, ఇంటలిజెన్స్ డీఎస్పీ మురళి, సంగారెడ్డి పట్టణ, రూరల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది, సహారా దవాఖాన సిబ్బంది పాల్లొన్నారు.