Joined BRS | నర్సాపూర్: కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ రామాంజనేయులు సోమవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. గతంలో చాలా సంవత్సరాలు కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగానని ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏదైనా మంచి చేయవచ్చని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. కానీ అతి తక్కువ సమయంలోనే నాకు జ్ఞానోదయం అయిందనీ మార్పు మార్పు అంటూ.. ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నూతనంగా చేరిన కార్యకర్తలకు ఏమైనా కష్టమొస్తే ఏ నాయకుడికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని దిగులు చెందారు. ఎందుకంటె ఇక్కడ కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ పద్ధతి ఇంకా కొనసాగుతుందని, చిన్న కార్యకర్త నుండి పెద్ద నాయకుల వరకు ఇదే పరిస్థితి ఉందని వాపోయారు. ముఖ్యంగా కౌడిపల్లి మండలంలో ఓ నాయకుడి ఒంటెద్దు పోకడకి పోతూ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అనే రీతిలో వ్యవహరిస్తున్నాడని అసహనం వ్యక్తం చేశారు. మండల స్థాయి నాయకులకు ఒకరికి కూడా సబ్జెక్టు లేదనీ అభివృద్ధి పనులు చేద్దామనే సోయి లేదనీ చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తూ ఇక ఆ పార్టీలో మనసు చంపుకొని ఇమడ లేనని కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నానని వెల్లడించారు.
బీఆర్ఎస్ లో చేరిన రామాంజనేయులు
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌడిపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ రామాంజనేయులు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సమక్షంలో సోమవారం చేరారు. అలాగే ఆయనతో పాటు కౌడిపల్లి లో25 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రామాంజనేయులుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారా రామాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.