చేర్యాల, నవంబర్ 8 : కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఆధ్యాత్మిక శోభ వచ్చిందని, ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్ధితి లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి, శ్రీ మహమ్మాయి అమ్మ వారి ఆలయాల నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సందర్భం గా మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేలు చేశారన్నారు.
కేసీఆర్ హయాంలో పల్లెలు పచ్చగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ పాలనలో దేవాలయాలు నిర్మాణానికి నోచుకున్నాయని, ప్రజలు సంతోషంగా గ్రామ దేవతలకు పండుగలు చేసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. రైతులు పండించిన ధాన్యం కొంటలేరని, రైతుభరోసా ఇవ్వడం లేదన్నారు. సీఎం, మంత్రులు సోయిలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు గమనిస్తున్నారని, వారి చేతిలో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదన్నారు.
పోలీస్‌శాఖపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఉల్లెంగల పద్మ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఉల్లెంగల సేవా ట్రస్ట్ చైర్మన్ ఉల్లెంగల ఏకానందం, ఏఎంసీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, మాజీ ఎంపీటీసీ టీ.వేణుగోపాల్, బీఆర్ఎస్ నాయకుడు చీపురు మల్లేశం,విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షుడు ఉల్లెంగల వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు టీవీ నారాయణ, తాటికొండ రాములు, తాటికొండ చక్రధర్, తాటికొండ ప్రవీణ్, సుభాష్, సుదర్శనం,పోలోజు బాలరాజు, పోలోజు కృష్ణమూర్తి, ఉల్లెంగల దేవదాసు,వెకంట్రాది, పోలోజు సుధాకర్, మహేందర్, ఉల్లెంగల కవిత, అనంతోజు బాలరత్నం, తాటికొండ యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.