పుల్కల్, జనవరి 24: బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగా జలవిద్యుత్ కేంద్రం నుంచి 2,667 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని నీటి పారుదలశాఖ డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు.
నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు, రైతులు, గొర్లకాపరులు అటువైపు వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 24టీఎంసీ నీరు నిల్వఉన్నట్లు అధికారులు తెలిపారు.